ఎన్ఆర్సీ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాఘవులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైందవ సంస్కృతిని అనుసరించేవారే దేశంలో ఉండాలనే వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. లౌకిక దేశంలో ఒక మతం కింద మరో మతం వారు ఉండాలంటే కష్టమని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నా.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన తెరాస.. ఎన్ఆర్సీపై ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. లౌకిక శక్తులకు కలుపుకొని ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై పోరాటం చేస్తామని రాఘవులు ప్రకటించారు.
ఇవీచూడండి: 'యూపీఏ ప్రారంభించిన ఎన్‌పీఆర్‌నే మేం కొనసాగిస్తున్నాం'