విద్య, వైద్యం, ఉపాధి తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు రామన్నపేటలో చేపట్టిన పాదయాత్ర.. మోత్కూరుకు చేరుకుంది. గత నెల 23న మొదలైన ఈ పాదయాత్ర.. ఈనెల 22 న భువనగిరిలో జరగబోయే సభతో ముగియనున్నట్లు జిల్లా కార్యదర్శి జహంగీర్ వివరించారు.
బస్వాపురం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నేతలు డిమాండ్ చేశారు. గంధమల్ల రిజర్వాయర్ ముంపు బాధితులకు.. మార్కెట్ రేటుకు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పాదయాత్రలో.. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాల్ రాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, అనురాధ, చంద్రారెడ్డి, రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బోనాల్లో పాల్గొన్న 40 మందికి కరోనా