దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన చట్టాలు ప్రమాదకరమైనవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ రంగంపై భాజపా తెచ్చిన చట్టాల కారణంగా భవిష్యత్లో పంటపైనే కాకుండా భూములపై కూడా ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు.
దిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాల విషయంలో తన వైఖరిని మార్చుకోవడం బాధాకరమని తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశ రాజధాని సరిహద్దులో రైతులు చేస్తోన్న పోరాటాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భాజపాను ఓడించడానికి ఇతర పార్టీలతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇదీ చదవండి: భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి