ETV Bharat / state

యాదాద్రిలో అతిథులకు అధునాతన ఆవాసాలు..

అతిథి దేవోభవ అన్న నానుడికి అద్దం పట్టేలా యాదాద్రీశుడి పుణ్యక్షేత్రంలో దేశవిదేశీ ప్రముఖుల విడిది కోసం ప్రత్యేక వసతులు సిద్ధమవుతున్నాయి. దాతల సహకారంతో కొండపై నిర్మిస్తున్న 14విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ కట్టడాలు పూర్తిదశకు చేరుకున్నాయని యాడ అధికారులు వెల్లడించారు.

యాదాద్రిలో అతిథులకు అధునాతన ఆవాసాలు..
యాదాద్రిలో అతిథులకు అధునాతన ఆవాసాలు..
author img

By

Published : Oct 21, 2020, 10:11 AM IST

యాదాద్రి పుణ్యక్షేత్రంలో దేశవిదేశీ ప్రముఖుల విడిది కోసం ప్రత్యేక వసతులు సిద్ధమవుతున్నాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి పంచరూపాలతో కొలువై ఉన్న కొండ దిగువన ఉత్తరాన 13, 26 ఎకరాల కొండపై, 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ కట్టడాలు పూర్తిదశకు చేరాయి. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రెసిడెన్షియల్ సూట్​ను కొండ శిఖరాగ్రాన... దాని క్రింది ప్రాంగణంలో, 7500 చదరపు అడుగుల స్థలంలో రెండు అంతస్తులుగా, నాలుగు విల్లాలు, దిగువన మరో పది విల్లాలు నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూట్ల సముదాయాన్ని దాతల ఆర్థిక సహకారం రూ. 104 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రూ.60 కోట్లు వ్యయం అయినట్లు "యాడ" అధికారులు చెబుతున్నారు.

cottages-for-the-foreign-guests-ready-in-yadadri-temple
యాదాద్రిలో అతిథులకు అధునాతన ఆవాసాలు..

రక్షణకు నాలుగు రకాల గోడలు..
కొండపైకి వెళ్లే కనుమదారిలో రక్షణగోడ, ఆర్​సీసీ గోడ, విల్లాల ప్రాంగణంలో గ్రీన్ టెర్రామెస్, ప్రెసిడెన్షియల్ సూట్ చెంత సెల్ఫ్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ ప్రాంగణాన్ని హరితమయంగా తీర్చిదిద్దే క్రమంలో ఉత్తరభారత్​ తరహాలో గోడకు గ్రీన్​మెష్ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్​అండ్​బీ​ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

విడిదికి ప్రత్యేక దారులు..విదేశీ దేశాధినేతలు విడిది చేసే సూట్​తో పాటు నాలుగు విల్లాలకు రెండు వరుసల రహదారి నిర్మితమవుతోంది. మరో పది విల్లాలకు రాకపోకలు సాగించేందుకు గాను అదనంగా రహదారి ఏర్పాటుకు పనులు చేపట్టారు. దైవదర్శనాలకు వెళ్లేందుకు ఆలయం వరకు ప్రత్యేక కనుమదారి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని యాడా తెలిపింది.

ఇదీ చూడండి: రాష్ట్రానికి మకుటంలా యాదాద్రి.. సీఎం సంకల్పానికి ఆరేళ్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.