యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు ఆ మహిళ ఇంటి సమీప పరిసరాలను, కాలనీలను కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించి.. పారిశుద్ధ్య పనులు చేపట్టి శానిటైజ్ చేశారు.
ప్రజలెవరూ ఆ ప్రాంతం గుండా రాకపోకలు చేయకుండా కర్ఫ్యూ విధించారు.. అలాగే కోవిడ్‌గా నిర్ధరణ అయిన మహిళ ప్రైమరీ కాంటాక్ట్స్‌ను సుమారు 13 మందిని, మరికొంతమందిని గుర్తించి హోమ్ క్వారంటైన్ విధించారు.
ఇవీ చూడండి: బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం