జనతా కర్ఫ్యూ తర్వాత 50 రోజుల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్నా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వలస నుంచి వచ్చినవారు తప్పితే జిల్లావాసులకు చెందని అప్రమత్తతతో గ్రీన్‌జోన్‌లోకి వెళ్లింది. కాని గత నెల రోజుల్నుంచి జిల్లాలో వాతావరణం తారుమారైంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిన జిల్లా అధికారులే హోం క్వారంటైన్‌కు పరిమితమవ్వాల్సి వచ్చింది.
గత శనివారం అస్వస్థత
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారి గత శనివారం నుంచి జ్వరంతో ఇబ్బందిపడుతున్నందున.. వారు కొవిడ్ పరీక్షల కోసం వైద్యులను సంప్రదించారు. రక్త నమూనాల్లో పాజిటివ్ వచ్చినట్లు యంత్రాంగం ధ్రువీకరించింది. సదరు సీఈవో ఐదురోజుల క్రితం కలెక్టరేట్లో దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సమీక్ష నిర్వహించిన జిల్లా అధికారులు నలుగురు ఇంటికే పరిమితమయ్యారు.
ఇప్పటివరకు 240 నమూనాలకు పరీక్షలు
జిల్లాలో ఇప్పటివరకు 240 మంది నమూనాలు పంపించగా.. ఇంకా ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది. పది మంది జిల్లావాసుల్లో వైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందగా.. ప్రస్తుతం 8 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ సహా జడ్పీ కార్యాలయాన్ని ముందస్తు చర్యల్లో భాగంగా శుద్ధి చేశారు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు