డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కలలుగన్న ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ పనిచేస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు తలారి గణేష్ పేర్కొన్నారు. జిల్లాలోని రామన్నపేట మండలం సర్నేనిగూడెంలో కరోనా మహమ్మారి పట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని.. చేతులు శానిటైజ్ చేసుకోవాలని తలారి గణేష్ సూచించారు.
సర్నేనిగూడెంలో కొవిడ్ వల్ల ఆరుగురు మరణించడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కరోనా అన్లాక్ సమయంలో స్వీయ రక్షణే శ్రీరామరక్ష అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు జినుక గోవర్దన్, గూని నరేందర్, కాకి కిరణ్, సర్పంచ్ ధర్నే రాణి, ఉపసర్పంచ్ శోభన్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Komati Reddy: టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి