ETV Bharat / state

సొంత నిధులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్​ నేత

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలతో పాటు పలు గ్రామాల్లో తన సొంత నిధులతో తెలంగాణ కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ విభాగం అధ్యక్షుడు సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.

congress leader nagargari preetham sprayed the chemical with his own funds
సొంత నిధులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్​ నేత
author img

By

Published : May 18, 2020, 11:40 PM IST

కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీ, పద్మశాలీ కాలనీల్లో తన సొంత నిధులతో రాష్ట్ర కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతమ్​ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రాజన్నగూడెం, దత్తప్పగూడెం గ్రామాల్లోని వీధుల్లో కూడా రసాయనాన్ని పిచికారీ చేయించారు.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు భాధ్యతగా మెలగాలని నాగరిగారి ప్రీతమ్​ అన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫైళ్ల సోమిరెడ్డి, నాయిని ప్రవీణ్ కుమార్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పురుగుల నర్సింహ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ లాక్​డౌన్​లో వీటికి మినహాయింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.