యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో 56 నెలలుగా స్వయంభువుల దర్శనాలు నిలిచాయి. సంక్రాంతి పండుగ తర్వాత దర్శనాలు తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీలైనంత తొందరగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని సీఎం ఆదేశించారు.
పెండింగ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ప్రధానాలయ గోపురాలపై, కళాశాల ప్రతిష్ట, ధ్వజ స్తంభ స్థాపనలతో సహా భక్తులు గర్భాలయ ప్రవేశానికి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ అంశంపై సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామిని కలిసే అవకాశం ఉందని యాడ"వర్గాలు" చెబుతున్నాయి. సంక్రాంతి పూర్తయ్యాక కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉన్నట్లు స్థానికంగా చర్చ కొనసాగుతోంది. భక్తులు కూడా స్వయంభు దర్శనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి : లైవ్ వీడియో: ప్రైవేటు బస్సు బీభత్సం