యాదాద్రి భువనగిరి జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 10 పాయింట్లు జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ అనితా రామచంద్రన్ అభినందన సమావేశం ఏర్పాటుచేశారు. వారందరితో కలిసి భోజనం చేశారు. . విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, ఉన్నత స్థితికి చేర్చిన పాఠశాలలను మరచిపోవద్దన్నారు.
జిల్లాలో అత్యధికంగా రాజపేట మండలం రఘనాథపూర్ ఉన్నత పాఠశాల నుంచి ఏడుగురు, రామన్నపేట మండలం జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఆరుగురు, చౌటుప్పల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నుంచి ఐదుగురు ఉన్నారు. మెుత్తం 26 మంది విద్యార్థులు హాజరవగా అందులో 23 మంది బాలికలే ఉండడం గమనార్షంఈ కార్యక్రమంలో జేసీ రమేష్, శిక్షణ కలెక్టర్ ప్రియాంక, డీఈవో రోహిణి పాల్గొన్నారు.
ఇవీ చూడండి:స్త్రీని గౌరవించినవారే బాగుపడ్డారు: ఈటల