యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మనీషా మృతదేహాన్ని బావిలో గుర్తించారు. కుటుంబ సభ్యులను జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పాలనాధికారి అనిత రామచంద్రన్ పరామర్శించారు. ఘటనపై పూర్తి వివరాలను మృతురాలి సోదరి నవనీతను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు మనీషా మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు.
తహసిల్దార్ పద్మ సుందరి సమక్షంలో పంచనామా నిర్వహించారు. మనీషా పుస్తకాల బ్యాగు, చెప్పులు కొన్ని వస్తువులను గుర్తించి పలు ఆధారాలు తీసుకున్నారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుందనుకున్నాం కానీ ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని మృతురాలి సోదరి నవనీత బోరున విలపించారు. మంగళవారం మనీషా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి : శ్రావణి, మనీషా హత్యకేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డి