యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలనాధికారి అనితారామచంద్రన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నలుగురు వైద్యులు విధులకు హాజరు కావటంలేదని వస్తున్న ఆరోపణల దృష్ట్యా పర్యవేక్షించారు. విధులకు ఎవరైనా వైద్యులు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలందించాలని సూచించారు. మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గేటు వద్ద నుంచి హాస్టల్ భవనం వరకు సీసీ రోడ్డు కావాలని సిబ్బంది అడగగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ఎనిమిది మంది పిల్లలు..కుటుంబ నియంత్రణ వద్దు..