ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు రానున్నారు. యాదాద్రిలో పర్యటించి.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకోనున్న సీఎం కేసీఆర్.. మొదటగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. హరిత హోటల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం పర్యటించే ఏరియాను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ప్రత్యేక తనిఖీ చేస్తున్నారు.
ఇదీచూడండి.. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్