ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి పర్యటన వాయిదా పడింది. కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఇటీవలే పర్యటించిన సీఎం... గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వాసాలమర్రి రూపురేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలని గ్రామస్థులకు సూచించారు. ఏడాది నాటికి బంగారు వాసాలమర్రి కావాలని, గ్రామంలో కరోనా కేసులు ఉండొద్దని ఆకాంక్షించారు. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన కేసీఆర్... కలిసి కూర్చోని మాట్లాడుకుందామని అన్నారు. త్వరలోనే ఇక్కడికి వస్తానని ముఖ్యమంత్రి గత పర్యటనలో చెప్పారు. మాట ప్రకారం గ్రామానికి రేపు సీఎం వెళ్లాల్సి ఉండగా వాయిదా పడింది.
ఇవీ చదవండి: