ETV Bharat / state

cm kcr visit yadadri: కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆలయ పునః ప్రారంభంపై క్లారిటీ! - యాదాద్రి భువనగిరి వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో యాదాద్రి(cm kcr visit yadadri)ని సందర్శించనున్నారు. . అటు ఆలయ ఉద్ఘాటనపై ఇప్పటికే చినజీయర్ స్వామితో చర్చించిన సీఎం... ఆ ముహూర్తాన్ని నేటి పర్యటనలో వెల్లడించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

cm-kcr-visits-yadadri-sri-lakshmi-narasimha-swamy-temple-on-today

author img

By

Published : Oct 19, 2021, 5:25 AM IST

Updated : Oct 19, 2021, 10:57 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) కాసేపట్లో యాదాద్రికి రానున్నారు. శ్రీలక్ష్మీ నరసింహుడి ఆలయ పునర్నిర్మాణ పనుల(Yadadri Temple)ను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం పదకొండున్నరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి రానున్న కేసీఆర్.... ప్రధానాలయం ప్రాంగణంలోని అతిథి గృహంలో అధికారులతో చర్చించనున్నారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజల చేసి ప్రధానాలయం పనులు పరిశీలించనున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆలయ ఉద్గాటన చేపట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చినజీయర్ స్వామిని కలిసి ఆలయ ప్రారంభం పై చర్చించారు. ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. నేటి పర్యటనలో ఆలయ ఉద్గాటన తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మహా సుదర్శన యాగం తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు..

తుదిదశకు చేరుకున్న నిర్మాణ పనులు

క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పుణ్యస్నానాల కోసం... కొండ కిందనున్న గండిచెరువు వద్ద 2.20 ఎకరాల్లో లక్ష్మీ పుష్కరిణి రూపొందింది. 11.55 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు... 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే అందులో నీటిని నింపి ట్రయల్ రన్ పూర్తి చేశారు. భక్తుల బస కోసం 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో... రూ.8.35 కోట్లతో నిర్మిస్తున్న మండప భవనం పనులు 95 శాతం పూర్తయ్యాయయాయి (yadadri development works) రూ.20.30 కోట్లతో 2.23 ఎకరాల్లో చేపట్టిన కల్యాణకట్ట తుది దశకు చేరుకుంటుండగా... ఆర్నమెంటల్ పనులు, 2.59 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండప నిర్మాణంలో పునాదుల పనులు జరుగుతున్నాయి. క్షేత్ర సందర్శనకు వచ్చే దేశ, విదేశీయుల విడిది కోసం... దాతల విరాళాలు రూ.104 కోట్లతో నిర్మితమవుతున్న ప్రెసిడెన్షియల్ సూట్లలో 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ భవనం పూర్తయింది.

శరవేగంగా..

రూ.13 కోట్ల వ్యయంతో.. ప్రసాదాల తయారీ, విక్రయ కాంప్లెక్స్​లో యంత్రాలను బిగించగా... స్వామివారి దర్శనానికొచ్చే భక్తుల కోసం... నాలుగు వేల మంది వేచి ఉండేలా కింది అంతస్తు సహా నాలుగంతస్తుల సముదాయాన్ని విస్తరించి, ఉత్తర దిశలో మందిర ఆకార హంగులతో తీర్చిదిద్దుతున్నారు. మాడ వీధిలో స్వర్ణ వర్ణంతో కూడిన ప్రత్యేక దర్శన వరుసలు పూర్తయ్యాయి. శివాలయం ప్రహరీ ఎత్తును తగ్గించి... దిమ్మెలపై ఇత్తడి తొడుగులు, వాటిపై త్రిశూలం తరహాలో లైటింగ్ ఏర్పాట్లున్నాయి. ఎదురుగా స్వాగతతోరణం, రథశాల, గార్డెన్ పనులు నడుస్తున్నాయి. విష్ణుపుష్కరిణి పునరుద్ధరణ పనులు కొనసాగుతుండగా... బస్ బే కోసం బండ తొలగింపుతోపాటు చదును చేసే పనులు జరుగుతున్నాయి. కొండపై ఉత్తర దిశలో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి: గంజాయికి అడ్డాగా మారుతున్న భాగ్యనగరం.. చర్యలకు ఉపక్రమించిన సర్కారు

Last Updated : Oct 19, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.