సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి, వాసాలమర్రి గ్రామస్థులతో ముచ్చటించారు. ఉదయం ముఖ్యమంత్రి సభకు వెళ్తుండగా.. వాసాలమర్రి గ్రామస్థులు 'సేవ్ స్కూల్, సేవ్ టెంపుల్' ప్లకార్డులు ప్రదర్శించారు. అది గమనించిన సీఎం తిరుగు ప్రయాణంలో వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కారులో నుంచే నిమిషం పాటు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, స్థానికులతో మాట్లాడారు.
ఆలయం ముందు నుంచే రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో భక్తులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుబంధు, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని ముల్కలపల్లి గ్రామస్థులను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గుంతలమయంగా మారిన తుర్కపల్లి-భువనగిరి రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : సీఎం కేసీఆర్