వాసాలమర్రి (Vasalamarri) గ్రామానికి మరో 20 సార్లు వస్తానని సీఎం కేసీఆర్ (Cm kcr) అన్నారు. మరోసారి తాను గ్రామానికి వస్తే సభ పెద్దఎత్తున నిర్వహించాలని సూచించారు. గ్రామంలోని ప్రజలంతా పరిచయం అయ్యేలా మరోసారి సభ పెట్టుకోవాలన్నారు. ఏడాది గడిచేసరికి గ్రామం బంగారు వాసాలమర్రి కావాలని ఆకాంక్షించారు. గ్రామస్థులంతా పట్టుదలతో కలిసికట్టుగా అనుకున్నది సాధించాలని కోరారు.
గ్రామంలో ఎలాంటి కేసులు ఉండకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాసాలమర్రి (Valasamarri)కి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్థుల్లో కూడా పట్టుదల పెరగాలన్న ఆయన పరిసర గ్రామాలకు కూడా వాసాలమర్రి ఆదర్శం కావాలని తెలిపారు.
వాసాలమర్రి గ్రామస్థులు అంకాపూర్ అభివృద్ధి చూసి వచ్చారని సీఎం (Cm kcr) పేర్కొన్నారు. అంకాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటేనే గ్రామస్థులకు సుప్రీంకోర్టు అని కేసీఆర్ చెప్పారు. కొన్నిసార్లు అంకాపూర్ సర్పంచ్‌కు కూడా రెండుసార్లు జరిమానా విధించిన ఘటనలున్నాయని గుర్తుచేశారు. ఏళ్లుగా పోలీసులు వెళ్లని విధంగా అంకాపూర్‌కు తయారైందని ఆ విధంగా వాసాలమర్రి తయారు కావాలన్నారు.
చప్పట్లు కొట్టుడు కాదు పనిజేయాలే. ఇంతకముందు ఒకాయన సీటీ కొడుతుండు. నేనేమైనా సినిమా యాక్టర్నా? ఇద్దరు ఆడబిడ్డల పక్కన కూర్చుని అన్నం తిన్న. ఇప్పుడు నాకు నలుగురే పరిచయమైండ్రు. ఆకుల ఆగవ్వ నాకు మంచి దోస్తు అయింది. ఇంకో 20 సార్లు ఈ ఊరికి వస్త. అందరం పట్టుబడితే అందరం అనుకుంటే ఈ వాసాలమర్రి ఏడాది కల్ల... బీ వాసాలమర్రి కావాలే. బీ అంటే ఏందీ బంగారు వాసాలమర్రి కావాలే. వాసాలమర్రి కూడా అంకాపూర్లెక్క కావాలే.
--- ముఖ్యమంత్రి కేసీఆర్
ఇదీ చూడండి: Cm Kcr: దత్తత గ్రామంలో సీఎం పర్యటన... గ్రామస్థులతో సహపంక్తి భోజనం