ETV Bharat / state

నేడు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. రాయగిరిలో భారీ బహిరంగ సభ - CM KCR visit in Yadadri

CM KCR Yadadri Tour: సీఎం కేసీఆర్​ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు. యాదాద్రిలో ప్రెసిడెన్షియల్​ సూట్​ను, భువనగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్​ను ప్రారంభించనున్నారు. అనంతరం రాయగిరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

CM KCR visit in Yadadri district and participate in rayagiri public meeting

author img

By

Published : Feb 11, 2022, 10:00 PM IST

Updated : Feb 12, 2022, 12:21 AM IST

CM KCR Yadadri Tour: నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా.. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రిలో నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభిస్తారు. యాదాద్రిలో నిర్మిస్తోన్న యాగశాలను పరిశీలించనున్నారు. ఒకటిన్నరకు భువనగిరికి సీఎం వెళ్తారు. భువనగిరి శివారులోని రాయగిరిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత.. 3.30కు పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయత్రం 4 గంటలకు రాయగిరిలో కలెక్టరేట్​ పక్కనే నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్​ పాల్గొంటారు.

సభ విజయవంతం చేసేందుకు కసరత్తు..

సీఎం పర్యటన దృష్ట్యా మంత్రి జగదీష్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టరేట్ సుందరీకారణ పనులను ఎప్పటి కప్పుడు సమీక్షించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారురు. సీఎం కేసీఆర్​ సభకు సుమారు లక్షా పది వేల మంది వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టు సభా స్థలి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా తెరాస ఆధ్వర్యంలో సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కమిటీలు, ఇంఛార్జిలను నియమించారు. జన సమీకరణకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు.

భద్రతా చర్యలు..

సమావేశానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలకు పార్కింగ్ వసతితో పాటు... శాంతి భద్రతలకు, ట్రాఫిక్​కి ఇబ్బంది కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాచకొండ కమిషనర్ సీపీ మహేష్ భగవత్ కలెక్టరేట్ సముదాయం, సభాస్థలి వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

CM KCR Jangaon Tour: నిన్న జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని యశ్వంతపూర్‌ వద్ద తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్... అనంతరం తెరాస బహిరంగ సభకు హాజరయ్యారు. సభలో ప్రసగించిన సీఎం.. జనగామ జిల్లాకు వరాలు కురిపించారు. ఈ సభలో కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్​.. అవసరమైతే దిల్లీ రాజకీయల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Feb 12, 2022, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.