CM KCR Bhuvanagiri Public Meeting Speech : ఒకప్పుడు కరువు ప్రాంతమైన భువనగిరిలో ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకుంటే.. భువనగిరి జిల్లా అయి ఉండేది కాదన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చామని తెలిపారు. ఈ క్రమంలోనే గతంలో రైతుల భూమిపై దశల వారీగా 10 మంది అధికారులకు పెత్తనం ఉండేదన్న సీఎం.. ధరణి తెచ్చి అందరి పెత్తనం తీసేశామని స్పష్టం చేశారు. భూమిపై రైతులకే అధికారం ఇచ్చామని.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కౌలు రైతులు, వీఆర్‌వోల బెడద మళ్లీ వస్తుందని చెప్పారు. ధరణి తీసేస్తే.. పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులకు 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆరోపించారు. మరోవైపు.. భువనగిరిని కూడా ఐటీ హబ్‌గా చేయాలని కేటీఆర్‌కు చెప్పానని కేసీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే భువనగిరిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రూపొందించామన్న సీఎం.. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని భయపెట్టారని.. అయితే ఇవాళ తెలంగాణలో భూముల ధరలు ఏ విధంగా పెరిగాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ తెలిపారు. కరవు ప్రాంతమైన భువనగిరిలో నేడు అద్భుతంగా పంటలు పండుతున్నాయన్నారు. జిల్లాకు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో యాదాద్రి భువనగిరి జిల్లా అని పెట్టుకున్నామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని.. ప్రగతికి, భవిష్యత్తుకు ఏది ముఖ్యమో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారు. కరవు ప్రాంతమైన భువనగిరిలో నేడు అద్భుతంగా పంటలు పండుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దు. ప్రగతికి, భవిష్యత్తుకు ఏది ముఖ్యమో ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. - సీఎం కేసీఆర్