MPP and MPTC war in Bhuvanagiri MPDO office: భారత రాజ్యాంగంలో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వారికి ప్రత్యేక స్థానాలు కల్పించి మంచి అవకాశాలు ఇస్తుంటే వారిని మాత్రం ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజు నుంచి వంటింటికి పరిమితం చేసి వారి భర్తలు సర్వభోగాలు అందుకుంటున్నారు. ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన.
కార్యాలయం మొదటి అంతస్థులో మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా గ్రౌండ్ ఫ్లోర్లో ఎంపీపీ భర్తకు, ఎంపీటీసీల భర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధి పనులు నిధుల కేటాయింపునకు సంబంధించి ఈ గొడవ జరిగింది. అంతే కాకుండా ఎంపీపీ ఛాంబర్లోకి ఎంపీటీసీల భర్తలు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
అలాంటప్పుడు ఎంపీపీ భర్త ఎంపీపీ ఛాంబర్లోకి ఎలా వెళ్తారని ఎంపీటీసీల భర్తలు ప్రశ్నించారు. మాటలు తీవ్ర స్థాయికి పెరగడంతో అక్కడ ఉన్న కార్యాలయ సిబ్బంది వారికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు. ఇందులో ఉన్నవారందరూ అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం మరో విశేషం.
ఇవీ చదవండి: