పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలంటూ... యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెంలో సీఐటీయూ ఆందోళన నిర్వహించింది. మోటార్ వాహన సవరణ చట్టం- 2019ని వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ మోటకొండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆటోరంగ కార్మికులతో రాస్తారోకో నిర్వహించారు.
భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నారని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కొల్లూరు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన