లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, పాత్రికేయుల సేవలు మరువలేనివని సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెక్‌పోస్టు వద్ద 163వ జాతీయ రహదారిపై పోలీసులకు, పాత్రికేయులకు ఆయన మాస్కులు, శానిటైజర్‌లు అందించారు. ప్రజల సమస్యలు గుర్తించడంలో పోలీసులు, జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే మాస్కులు, శానిటైజర్‌లను వారికి పంపిణీ చేశామన్నారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం