శుక్రవారం రాత్రి ఆలేరులోని జన ఆశీర్వాద యాత్రలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెరాస ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు విసిరారు. తెలంగాణ ప్రజల ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్య మంత్రి కేసీఆర్... ఆయన కేటీఆర్... మొత్తం కుటుంబం కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.
''1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి ప్రయోజన చేకూరడం లేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ.. కేసీఆర్ తానే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. వెనకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కింది. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది.
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆలేరులో అసంపూర్తిగా ఉన్న ఆర్యూబీ పనులను పూర్తిచేయించేందుకు... సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. పర్యాటక శాఖ నుంచి రాష్ట్రానికి ఎక్కువ మొత్తం నిధులు కేటాయించి... అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడతామన్నారు. యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి ఆలేరుకు వచ్చిన కిషన్ రెడ్డి... పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆసు యంత్రం సృష్టికర్త మల్లేశం ఇంటికి వెళ్లారు. చేనేత వృత్తిలో శ్రమను తగ్గించేలా ఆసు యంత్రం రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచారని మల్లేశంను అభినందించి... సన్మానించారు. అన్నివేళలా ప్రభుత్వపరంగా ప్రోత్సాహిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 11 కుల సంఘాల ముఖ్య నాయకులను సన్మానించి వారితో ముచ్చటించారు.
KishanReddy: రెండో రోజు విజయవంతంగా కిషన్రెడ్డి యాత్ర.. విమర్శలతో దూకుడు పెంచిన మంత్రి
జనగామ జిల్లా పెంబర్తి నుంచి బయలుదేరి వచ్చిన కిషన్రెడ్డి ఆలేరు పట్టణ శివారులోకి రాత్రి 11.15 గంటలకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ్రు శోభ రాణి, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ పలువురు ముఖ్య నేతలు ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం తెలిపారు. అధిక సంఖ్యలో భాజపా, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ శ్రేణులు, వాహనాలతో ఆలేరు ప్రధాన రహదారి కాషాయ రంగును సంతరించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. కొండపైన గల పర్యాటక అతిథి గృహంలో బస చేశారు.
ఇదీ చూడండి: KISHAN REDDY: యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్రెడ్డి