ETV Bharat / state

చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి - చెరువులోకి దూసుకెళ్లిన కారు

యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో సర్పంచ్ భర్త, కుమారుడు డ్రైవర్ మృతి చెందారు. సీసీ కెమెరా దృశ్యాల ద్వారా గుర్తించి చెరువులోంచి కారుతో సహా మృతదేహాలను బయటకి తీశారు.

car accident in yadadribhuvanagiri sarnenigudeam three persons dead
చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి
author img

By

Published : Feb 22, 2020, 3:18 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెం గ్రామ సర్పంచి రాణి భర్త మధు, కుమారుడు మత్స్యగిరి, డ్రైవర్‌ సాగుబావిగూడేనికి చెందిన శ్రీధర్‌రెడ్డి సమీప గ్రామానికి వెళ్లొస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎల్లంకి కట్టపై నుంచి కారు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ముగ్గరూ అందులోనే ఇరుక్కుపోయారు.

చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి

సీసీ దృశ్యాల్లో గుర్తించి..

ఎంతకూ వారు ఇంటికి చేరుకోకపోవడం వల్ల కుటుంబ సభ్యులు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి నుంచి వారి కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు ఎల్లంకి గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించి.. కారు చెరువు కట్టపైకి వెళ్లినట్టు గర్తించారు.

ఇవాళ మధ్యాహ్నం ఎల్లంకి చెరువులోంచి కారుతో సహా 3 మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.