ETV Bharat / state

జవాన్ల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ - telangana news today

ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో సైనికుల మృతికి సంతాపంగా భువనగిరిలో హిందు వాహిని శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జవాన్లు మరణిస్తే వారి మృతిపై పౌర హక్కుల నేతలు స్పందించరా అని ఆవేదన వ్యక్తం చేశారు.

Candles rally at bhuvanagiri, soldiers attack at chhattisgarh
జవాన్ల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Apr 5, 2021, 10:36 PM IST

ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన భారత జవాన్లకు యాదాద్రి జిల్లా హిందు వాహిని శాఖ ఆధ్వర్యంలో భువనగిరిలో ఘన నివాళులర్పించారు. కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వీర జవాన్ల మృతికి సంతాపంగా వినాయక్ చౌరస్తా వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు.

20 మందికిపైగా భారత జవాన్లు మృతి చెందితే పౌర హక్కుల నేతలు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే నక్సల్స్ చనిపోతే నిరసన ర్యాలీలు, కేసులు వేసే పౌరహక్కుల నేతలు.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. మరణించిన ఒక్కో సైనికుడి కుటుంబ నేపథ్యం పౌర హక్కుల నేతలకు కనిపించవా అని నిలదీశారు.

ఇదీ చూడండి : రాజన్న సిరిసిల్ల జిల్లా జయవరంలో 51 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.