వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజు స్వామి వారికి.. గంగాళంలో చక్రస్నానం, దేవతోద్వాసన పర్వాలను నిర్వహించారు.
కల్యాణ దంపతులైన శ్రీ లక్ష్మీనారసింహులకు అనేక రకాల పుష్పాలతో వేదమంత్రోచ్చారణల నడుమ యాగాన్ని చేపట్టారు. గురువారం వేడుకలు ముగుస్తున్నందున్న.. అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించేందుకు సంప్రదాయ ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకల్లో.. ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, పేష్కార్ రమేశ్‌బాబు, ఏఈవోలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కళారూపానికి కాదేదీ అనర్హం!