యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు . డ్రైవర్‌కు కళ్లు తిరగి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి: శ్రీశైలం నుంచి తిరిగి వస్తుంటే....