ETV Bharat / state

ప్రైవేట్‌ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం

లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు తెరవక ఆర్థిక సమస్యలతో టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

bjym protests at yadadri bhuvanagiri collectorate
ప్రైవేట్‌ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం
author img

By

Published : Oct 23, 2020, 11:00 AM IST

ప్రైవేట్‌ టీచర్లను ఆదుకోవాలంటూ బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ని కార్యకర్తలు ముట్టడించారు. కలెక్టరేట్ లోనికి వెళ్లడానికి కార్యకర్తలు, టీచర్లు ప్రయత్నించడంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి కార్యకర్తలు వినతి పత్రాన్ని సమర్పించారు. కరోనా వైరస్‌ కారణంగా స్కూళ్లు తెరవకపోవడంతో ఆర్థిక సమస్యలతో టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుని కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి: దీక్షిత్‌ హత్యకేసు.. రివర్స్​ ట్రాకింగ్​తో పట్టుబడ్డ నిందితుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.