ETV Bharat / state

'తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు' - యాదగిరిగుట్టలో బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర

praja sangrama yathra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వేదికగా ఆ పార్టీ నేతలు తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 8 ఏళ్ల పాలనలో ఒక్కరోజూ సచివాలయానికి రాని సీఎం కేసీఆర్..​ ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్​ మంత్రి పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. త్వరలోనే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

'తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు'

author img

By

Published : Aug 2, 2022, 3:31 PM IST

Updated : Aug 2, 2022, 5:09 PM IST

praja sangrama yathra: తెరాస 8 ఏళ్ల పాలనలో మాటలు తప్ప చేతలు లేవని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. హత్యలు, అత్యాచారాలకు ప్రతి రూపం తెరాస ప్రభుత్వమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్​ మాత్రం తాను దిల్లీ పీఠం ఎక్కుతా అంటున్నారని మండిపడ్డారు. బండి సంజయ్​ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో అన్నదాతలకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటికీ ఎందుకు చేయలేదని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారు ప్రస్తుతం ఎక్కడికి పోయారని నిలదీశారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారన్న ఆయన.. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు. 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదని.. కేసీఆర్ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాలేదని విమర్శించారు.

హత్యలు, అత్యాచారాలకు తెరాస ప్రతిరూపం. 8 ఏళ్లలో కేసీఆర్ చేసింది శూన్యం. రుణమాఫీ చేస్తానని ఇప్పటికీ చేయలేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారు ప్రస్తుతం ఎక్కడికిపోయారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్​ మంత్రి పదవులు కట్టబెట్టారు.-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

ETELA RAJENDER: కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్​ లక్ష్యం..: తెలంగాణలో తెరాస రాజ్యాంగమే నడవాలన్నట్లు ఈ ప్రభుత్వ వైఖరి ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్‌ ఏకైక లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు. యాదగిరిగుట్టలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల మాట్లాడారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్​

‘‘భాజపాపై పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా కేసీఆర్‌ పట్టించుకోలేదు. దిల్లీలో చక్రం తిప్పడం కాదు.. ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుంది. తెరాస మంత్రుల్లో సగం మంది తెలంగాణ వద్దన్న వాళ్లే. కేసీఆర్‌ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఈ 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదు.

తెరాస నేతలు దళితుల అసైన్డ్‌ భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్‌ ఉంటే ప్రగతిభవన్‌లో.. లేకపోతే ఫామ్‌హౌస్‌లో ఉంటారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రారు. దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్నారు. దళితుల అసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారు. ఫారెస్టు భూముల పేరుతో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే అవకాశం నల్గొండలో రాబోతోంది. కేసీఆర్‌ పరిపాలన అంతమొందించడమే భాజపా కర్తవ్యం’’ అని ఈటల అన్నారు.

Gajendra Singh Shekawat..: బండి సంజయ్ మొదటి రెండు విడతల పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ పేర్కొన్నారు. మూడో విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ఇక్కడికి వచ్చానన్న ఆయన.. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో మనం చూస్తున్నామన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నిజమైన నివాళి ఇవ్వాలి అంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనన్నారు.

కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​

తెలంగాణలో సీఎం కేసీఆర్​ ఒక రాజులా.. నియంత పాలన కొనసాగిస్తున్నారని షెకావత్​ విమర్శించారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. త్వరలోనే బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని షెకావత్​ ఆరోపించారు. కాళేశ్వరం కేసీఆర్​కు డబ్బు సంపాదించే మిషన్​ అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్.. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణలో కేసీఆర్ ఒక రాజులా.. నియంత పాలన సాగిస్తున్నారు.​ కమీషన్ల కోసమే కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే.. కేసీఆర్​ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి. త్వరలోనే బండి సంజయ్​ ఆధ్వర్యంలో తెలంగాణలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. - గజేంద్రసింగ్​ షెకావత్​, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి

ఇవీ చూడండి..

LIVE : బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభం

Last Updated : Aug 2, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.