ETV Bharat / state

కుమార్తె గృహప్రవేశానికి వెళ్లొస్తూ... అనంతలోకాలకు..! - latest news on bike accident at bebenagar one person dead one injured

కూతురు గృహ ప్రవేశానికి హాజరైన దంపతులు తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో.. భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

bike accident at bebenagar one person dead one injured
స్కూటీని ఢీకొట్టిన కారు.. భర్త మృతి, భార్యకు గాయాలు
author img

By

Published : Apr 2, 2020, 1:01 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో భర్త మల్లారెడ్డి మృతి చెందగా... భార్య భారతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్​కు చెందిన మల్లారెడ్డి దంపతులు బుధవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో తన కూతురు గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈరోజు ఉదయం తిరిగి హైదరాబాద్​కు ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా.. బీబీనగర్ మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద వెనకగా వస్తున్న కారు ఢీకొట్టింది.

ఘటనలో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. భారతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్ఛురీకి తరలించారు. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కారు డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కూటీని ఢీకొట్టిన కారు.. భర్త మృతి, భార్యకు గాయాలు

ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.