ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: జార్జియాలో చిక్కుకుపోయిన భువనగిరి యువతి - యాదాద్రి జిల్లా వార్తలు

భువనగిరికి చెందిన దాత్రిక శివాని పైచదువుల కోసం జార్జియా దేశానికి వెళ్లింది. అనారోగ్యంతో భారత్​కు రావడానికి ఎయిర్ పోర్ట్​కి రాగా అక్కడి అధికారులు ఆమె ప్రయాణాన్ని నిలిపివేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అక్కడి సిబ్బంది శివాని ప్రయాణాన్ని నిరాకరించారు. అయితే తమ కుమార్తెకు కరోనా లేకున్నా అడ్డుకున్నారని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తమనైనా జార్జియాకు పంపాలనే లేదా శివానినైనా భారత్​ రప్పించాలని వేడుకుంటున్నారు.

కరోనా ఎఫెక్ట్: జార్జియాలో చిక్కుకుపోయిన భువనగిరి యువతి

author img

By

Published : Mar 19, 2020, 5:22 PM IST

కరోనా ఎఫెక్ట్: జార్జియాలో చిక్కుకుపోయిన భువనగిరి యువతి

యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన దాత్రిక వెంకటేశ్​, సరిత దంపతుల కుమార్తె శివాని.. మెడిసిన్ కోసం జార్జియా దేశం వెళ్లింది. అక్కడ అకాకి విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే గత నాలుగైదు రోజులుగా తీవ్రమైన తల నొప్పితో శివాని బాధపడుతోంది. స్నేహితులు అక్కడి సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకి బ్రెయిన్​లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. శివాని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమార్తె మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రమ్మని చెప్పి కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసుకున్నారు. జార్జియా నుంచి శివానిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జార్జియా నుంచి వచ్చే సమయంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎయిర్​పోర్ట్ సిబ్బంది చివరి నిమిషంలో శివాని విమానంలో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరోనా లేనప్పటికీ.. అక్కడి అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి ఆసుపత్రిలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె ఆరోగ్యం తలుచుకుంటూ తల్లి సరిత కన్నీరు మున్నీరయ్యారు. జార్జియాకు వెళ్లడానికి తమకు అవకాశం కల్పించాలని.. లేదంటే శివానిని ఇక్కడికి తీసుకురావటానికి అధికారులు, తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: సచివాలయంలోకి సందర్శకులకు ప్రవేశం లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.