అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దృష్ట్యా... యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బొమ్మలరామారంలోని ఓ ఎక్స్‌ప్లోసివ్ కంపెనీపై కేసు విషయంలో నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదని, పలు పేకాట కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రాగా... సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీఐ సురేందర్‌రెడ్డి స్థానంలో జానయ్యను నియమిస్తూ... రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు భువనగిరి పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలకు జిల్లా పోలీస్ శాఖకు చెందిన కొంత మంది అధికారుల అండదండలు ఉండటం వల్ల అక్రమార్కులకు అడ్డూఅడుపు లేకుండాపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.