ETV Bharat / state

భువనగిరిలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ - ఏడుగురు వ్యక్తుల అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ఓ ఫామ్ హౌస్​లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 వేల రూపాయలు, 7 చరవాణులు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

seven memberrs arrested in bhuvanagiri for playing cards
భువనగిరిలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
author img

By

Published : Jun 17, 2020, 10:38 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ఓ ఫామ్​ హౌస్​లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బోడుప్పల్​కి చెందిన తోటకూర చందర్, రవి యాదవ్, విజయ్ కుమార్, వెంకట్, భువనగిరి పట్టణానికి చెందిన సురేష్, వెంకట కృష్ణ, వీరవల్లికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు.

వారి వద్ద నుంచి 78 వేల రూపాయల నగదు, 9 సెట్ల కార్డులు, 7 చరవాణులు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరందరినీ భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.