యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారంలోని చిరుప్రాయంలోనే అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులను కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గం ఇంఛార్జ్, బీర్ల ఫౌండేషన్ ఛైర్మన్ ఐలయ్య పరామర్శించారు. ఏడాది క్రితం తల్లి మమత చనిపోగా, మూడు రోజుల క్రితం తండ్రి మాడెల్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారని కుటుంబసభ్యులు రోదిస్తూ ఆయనకు తెలిపారు.
వారిని ఆదుకోవాలంటూ ఐలయ్యను వేడుకున్నారు. బీర్ల ఫౌండేషన్ పరంగా అన్ని విధాలా చిన్నారులకు అండగా ఉంటానని ఆయన మాటిచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో చిన్నారుల చదువులకు అయ్యే ఖర్చును బీర్ల ఫౌండేషన్ భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడి చిన్నారుల పేరు మీద చెరో రూ.10 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్