యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటన జరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కేసుపై తీర్పు రాకపోయినా... వారి కుటుంబసభ్యులకు బీసీ కమిషన్ ఆర్థిక సహాయం అందజేశారు.
ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల నగదు చెక్కును స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యే గొంగిడి సునీత అందజేశారు. హత్యకు గురైన చిన్నారుల కుటుంబసభ్యులకు తగిన న్యాయం జరగాలంటే.. మర్రి శ్రీనివాసరెడ్డికి త్వరగా శిక్ష పడాలని కోరారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం