ETV Bharat / state

ఆత్మహత్యలు వద్దంటూ యువత ర్యాలీ

జననం ఒక జీవితం మరణం ఒక క్షణం. నిండు జీవితాలను నిర్దాక్షిణ్యంగా ముగించేసి తనువు చాలిస్తే సమస్య సమసిపోదు. పుట్టెడు ఆశలతో... చావుకు ఎదురొడ్డి జన్మనిచ్చిన తల్లిప్రేమను సమాధి చేసి.. తండ్రి ఆశలను కన్నీటిలో ముంచి అర్థ రహితంగా జీవితాన్ని ముగించే యువతకు కనువిప్పు కలిగించేలా కొందరు యువకులు కొత్త ఒరవడికి పూనుకున్నారు.  'ఆత్మహత్యలు వద్దు కుటుంబ సభ్యులు ముద్దు' అంటూ నినాదంతో ర్యాలీ చేపట్టారు.

ఆత్మహత్యలు వద్దంటూ యువత ర్యాలీ
author img

By

Published : Apr 12, 2019, 5:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తిలో గత ఆరు నెలల్లో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. మిత్రుల మరణంతో కలత చెందిన ఆ ఊరి యువకులు వారిని తలచుకుంటూ బాధ పడుతూ కూర్చోలేదు. ఆ కుటుంబాలకు కలిగిన మనో వేదన ఎవ్వరికీ కలగకూడదంటూ ఊర్లో యువకులంతా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

యువతా మేలుకో ఆత్మహత్య మానుకో

ఊర్లో యువకులంతా చేరి ర్యాలీ చేశారు. చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం కాదంటూ నినదించారు. యువతా మేలుకో ఆత్మహత్యలు మానుకో.. అమ్మా నాన్న ఉండగా ఆత్మహత్యలు చెడ్డరా.. అంటూ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

ఆత్మహత్యలు వద్దంటూ యువత ర్యాలీ

ఇదీ చదవండి: ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.