యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చందేపల్లి, చామపూర్, నాంచారిపేట గ్రామాల్లో కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశాలతో ఏఎన్ఎం గీత ఆధ్వర్యంలో కరోనాపై కళాకారుడు చందు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఏ మాత్రం లక్షణాలున్నా వెంటనే ఆశా వర్కర్లను, మండల వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఇంటింటి సర్వేకి అందరూ సహకరించాలని ఏఎన్ఎం కోరారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
మోటకొండూరులో 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మండల అధికారులు తెలిపారు. చందేపల్లి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మున్నీ జలందర్ రెడ్డి, ఇంఛార్జి సెక్రటరీ ప్రత్యూష, వార్డ్ మెంబర్ కళ్లెం నర్సమ్మ, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల రవీందర్ రెడ్డి, ఆశా వర్కర్ పద్మ, గోసంగి పరమేశ, బోట్ల లక్ష్మీ నరసింహ, బోలుగుల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రెండో దశలో వేగంగా పల్లెలను చుట్టుముడుతున్న కరోనా