యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామంలో చైల్డ్లైన్కి వచ్చిన సమాచారంతో అధికారులు సమన్వయంతో బాల్యవివాహాన్ని ఆపారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అరూర్ గ్రామంలో 15 సంవత్సరాలున్న మైనర్ బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అధికారులు... బాలిక తల్లిదండ్రులకు స్థానిక పోలీస్స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. 2006 బాల్య వివాహల చట్టంపై అవగాహన కల్పించారు. బాలికకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. అలా కాకుండా చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హామీ పత్రం రాసిచ్చారు.