ETV Bharat / state

యాదాద్రిలో కూల్చివేస్తున్న ఇళ్లు

author img

By

Published : Mar 3, 2021, 7:07 AM IST

భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు ఉన్న ఇళ్లను దాదాపు కూల్చివేశారు. భారీ యంత్రాలతో గత వారం రోజులుగా తొలగిస్తున్నారు.

Authorities demolish houses in Yadadri temple yadagirigutta
యాదాద్రిలో కూల్చివేస్తున్న ఇళ్లు

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు ఉన్న ఇళ్లను దాదాపు కూల్చివేశారు. భారీ యంత్రాలతో గత వారం రోజులుగా ఈ పనులు చేపట్టారు. ఆర్అండ్​బీ శాఖ అధికారులు, నిర్వాసితులకు పరిహారం చెల్లించి పనులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చేలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు పనులను వేగవంతం చేశారు.

ఇప్పటికే 80 శాతం పనులు పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నాయి. భారీ యంత్రాల సాయంతో కూల్చి వేసిన శిధిలాలను తొలగించి. మరో వైపు నుంచి ఎర్రమట్టితో నేలను చదును చేస్తున్నారు. కొండ కింద నూతనంగా నిర్మించిన వైకుంఠ ద్వారం వద్ద ఉన్న.. అతి పురాతనమైన రావిచెట్టును రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు.

మొక్కలకు మార్కింగ్

నక్షత్ర వనంలో మొక్కలకు మార్కింగ్

యాదాద్రి కొండ కింద వలయ రహదారి దేవస్థానం, పంప్ హౌస్ వద్ద వైటీడీఏ అధికారులు.. నక్షత్ర వనంలో మొక్కలకు మార్కింగ్ వేశారు. అందులో సుమారు 12 రాశులకు కావలసిన 12 మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : రేపు యాదాద్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.