యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యేక వరసల బాక్స్‌ల ఏర్పాటుకు యాడా నడుం బిగించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అల్యూమినియం, ఇత్తడి లోహంతో ఆర్కిటెక్ట్ ఆనందసాయి పర్యవేక్షణలో వాటిని రూపొందించారు.
ఆలయంలో భక్తిభావాన్ని పెంపొందించే తరహాలో వైష్ణవత్వం ఉట్టిపడేలా శంఖం.. విష్ణుచక్రం.. తిరునామంతోపాటు జయ, విజయుల రూపాలను పొందుపరిచారు. ఉజ్జయినీ అమ్మవారి ఆలయం, గుజరాత్‌లోని స్వామి నారాయణ్ మందిరంలో ఇలాంటి బాక్స్‌లు ఉన్నాయని, పనులను పర్యవేక్షిస్తున్న ఆర్కిటెక్ట్ ఆనందసాయి తెలిపారు.
ఇదీ చదవండి: భూ సమస్యలతో రైతులు సతమతం.. అందని సంక్షేమం