యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక ఉత్సవాల్లో భాగంగా.. స్వామివారు గోవర్ధనగిరిధారి అలంకారంలో దర్శనమిచ్చారు. బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

లోకకల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు వివరించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామి సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్రవైఢూర్యాలతో ముగ్ధమనోహరంగా ముస్తాబైన స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి సేవలో ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తి పాల్గొన్నారు.

- ఇదీ చదవండి : రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం