ETV Bharat / state

పశువులకు టీకాలు వేసిన మంత్రి తలసాని

యాదాద్రి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ప్రారంభించారు. పశువులకు టీకాలు వేశారు.

animal teeka program in yadadri bhuvanagiri
పశువులకు టీకాలు వేసిన మంత్రి తలసాని
author img

By

Published : Feb 1, 2020, 3:00 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉదేశమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో పశువులకు టీకాలు వేసి.. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు వారి పాడిపశువులకు తప్పకుండా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.

ఈ సారి పశువులకు జియో ట్యాగింగ్ విధానం తెచ్చామని తలసాని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎలాగైతే ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారో.. అలాగే పశువులకు టీకాల కార్యక్రమంపై దృష్టి పెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్.. పంట పండించే రైతులకు ఎలా సహాయం చేస్తున్నారో అలాగే పాడి రైతులకు కూడా అన్ని విధాలా సాయం అందిస్తున్నారన్నారు. ఆలేరు ఎమ్మెల్యే కోరిన విధంగా ఆలేరు నియోజకవర్గంలో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 'ఈసారైనా.. కనికరిస్తారా లేదా పాత పాటే పాడతారా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.