ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. నాలుగు రోజుల క్రితం ఆమె స్వల్ప అస్వస్థతకు గురికాగా... చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. అక్కడ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.... పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరించారు. ప్రస్తుతం ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దంటూ పార్టీ శ్రేణులకు తన వ్యక్తిగత సహాయకునితో సందేశం పంపించారు. తన భర్త మహేందర్ రెడ్డి నమూనాలు పంపించామన్న సునీత... ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
ఇదివరకే...
రాష్ట్రంలో వరుసగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందే జనగాం శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్త సహా... హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు కూడా కరోనా బారిన పడ్డారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య