యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కోల. స్వామి గౌడ్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నైపుణ్యం కలిగి ఉన్న క్రీడాకారుల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మారుమూల పల్లెల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామాల్లోని యువతకు గుర్తింపు వచ్చేందుకు క్రీడాలు తోడ్పడుతాయని ఆమె అన్నారు. తండ్రి జ్ఞాపకార్థం టోర్నమెంట్ ఏర్పాటు చేసిన కోల వెంకటేష్ గౌడ్‌ను అభినందించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 24 జట్లు పాల్గొన్నాయి.
ఇది చదవండి: తల్లిదండ్రులూ పారాహుషార్... మత్తును వదిలించాల్సింది మీరే!