రైతులకు వ్యవసాయ సంబంధిత సేవలను మరింత చేరువ చేసేందుకే రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో మంగళవారం రైతు వేదిక భవనాన్ని సునీత ప్రారంభించారు. సాగుకు ఉపయోగకరమైన ప్రతి ఎకరాకు నీరందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా పంటల సాగులో రైతు వేదికల ద్వారా అన్నదాతలు పలు సూచనలు, సలహాలు పొందుతారని పేర్కొన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం మండలంలోని పలు గ్రామాల్లోని కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్, తహసీల్దార్ గణేష్, డీఏఓ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చెత్తకుప్పల్లో 800 ఏళ్ల చరిత్ర.. పూర్వ వైభవం వచ్చేనా?