యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ ఎమ్మెల్యే పోచయ్య మృతికి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోచయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు పోచయ్య మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. పోచయ్య మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు