యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం చేశారు. వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలో సుదర్శన ఆళ్వారును కొలుస్తూ సుదర్శన నారసింహ హోమం జరిపారు.
అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఏకాంత సేవలో లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
ఇదీ చదవండి: బేగంపేట వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు