ETV Bharat / state

ఆలేరు ఠాణాకు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు.. సీపీ మహేశ్​ భగవత్​ హర్షం - ఆలేరు పోలీస్​ స్టేషన్​

5th Rank in National level to Aaleru PS: జాతీయ స్థాయిలో ఆలేరు పోలీసు స్టేషన్ 5వ ర్యాంకు పొందడం యావత్ తెలంగాణ పోలీసులకు గర్వ కారణమని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. కేంద్ర హోంశాఖ ఎంపిక చేసిన జాబితాలో జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీసు ఠాణాగా ఎంపికవటం పట్ల సీపీ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ తెలంగాణ పోలీసు ఘనతను మరింతగా ఇనుమడింపజేయాలని కోరారు. కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆలేరు ఎస్సై ఎం.డి.ఇద్రిస్ అలీకి శాలువా కప్పి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

5th rank to aaleru police station
ఆలేరు పోలీస్​ స్టేషన్​కు ఐదో ర్యాంకు
author img

By

Published : Apr 30, 2022, 1:44 PM IST

5th Rank in National level to Aaleru PS: పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల సేవలో అంకితం కావాలని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ఆకాంక్షించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్​ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీసు స్టేషన్​ను కేంద్ర హోం శాఖ.. జాతీయ స్థాయిలో ఉత్తమ ఠాణాగా ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమిషనరేట్​లో అభింనందన కార్యక్రమం నిర్వహించారు. ఆలేరు పోలీసు వ్యవస్థ.. ప్రజల ప్రశంసలతో పాటు శాఖాపరంగా అభినందనలు అందుకుంటోందని ఆయన కొనియాడారు. ఆలేరు పోలీసులు అరుదైన ఘనత సాధించడంతో.. రానున్న రోజుల్లో తెలంగాణ పోలీసుల బాధ్యతను మరింత పెంచిందని గుర్తు చేశారు.

"ఆలేరు పోలీసు స్టేషన్ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు పొందడం యావత్ తెలంగాణ పోలీసులకు గర్వ కారణం. గతంలోనూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నారాయణపూర్ పోలీసు స్టేషన్ జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించింది. భవిష్యత్తులో ఇదేస్ఫూర్తితో పనిచేస్తూ తెలంగాణ పోలీసు ఘనతను మరింతగా ఇనుమడింపజేయాలి. తెలంగాణ పోలీసు వ్యవస్థ నిరంతరం అమూల్యమైన సేవలందిస్తుండటంతో రాష్ట్రంలో నేరాల శాతం తగ్గుతోంది. ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చూరగొనాలి." -మహేశ్ భగవత్​, రాచకొండ సీపీ

అనంతరం సీపీ మహేశ్​ భగవత్.. ఆలేరు ఎస్సై ఎం.డి.ఇద్రిస్ అలీకి ​ శాలువా కప్పి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. యాదాద్రి ఏసీపీ కె. నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట పూర్వ సీఐ జి.నర్సయ్యకు శాలువాలు కప్పి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ క్రైమ్​ డీసీపీ పి.యాదగిరి, ఏసీపీ- సీసీ ఆర్బీ ఎం.జగదీశ్​ చందర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: పోలీసు ఉద్యోగ దరఖాస్తులకు సర్వం సిద్ధం... సాంకేతిక సమస్యలు రాకుండా...

'కోర్టుల్లో ఆ భాషలు వాడాలి.. పౌరులకు చేరువ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.