యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్, దయ్యంబండ గ్రామాల్లో మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రారంభించారు. అనంతరం దయ్యంబండ తండా నుంచి తుర్కపల్లి వైపు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ గ్రామాల్లో అభివృద్ధి బాగా జరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, నిర్మాణాలు, నర్సరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని సునీత తెలిపారు.
ఇదీ చదవండి: ఐటీ సొబగులతో సహకార రంగంలో అద్భుత ఫలితాలు...