ETV Bharat / state

వేల వర్ణాలు కలబోసి.. స్వతంత్ర భారతికి రూపమిచ్చి.. - ts news

Portrait of India on a Handloom Saree: స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జాతీయ భావం ఉట్టిపడేలా సుమారు పది వేల వర్ణాలతో వస్త్రాన్ని తయారు చేశారు భూదాన్ పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య అనే చేనేతకారుడు. భారతదేశ చిత్రపటం, మధ్యలో రాట్నం చరక వచ్చే విధంగా డబుల్ ఇక్కత్​ వస్త్రాన్ని నేసి మరోసారి భూదాన్ పోచంపల్లి చేనేత ఖ్యాతిని అందరికి తెలిసేలా చేశాడు.

వేల వర్ణాలు కలబోసి.. స్వతంత్ర భారతికి రూపమిచ్చి..

author img

By

Published : Feb 13, 2022, 5:31 PM IST

వేల వర్ణాలు కలబోసి.. స్వతంత్ర భారతికి రూపమిచ్చి..

Portrait of India on a Handloom Saree: స్వాతంత్య్ర పోరాటానికి, చేనేతకు అవినాభావ సంబంధం ఉంది. నాడు మహాత్మాగాంధీ రాట్నం తిప్పారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలు మేలని చాటిచెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జాతి మొత్తం ఆజాదీకా అమృత్‌ మహోత్సవం జరుపుకొంటోంది. ఆ వేడుక నేపథ్యంలో.. ఒకే వస్త్రంపై 10 వేల వర్ణాలు, భారతదేశ చిత్రపటాన్ని డబుల్‌ ఇక్కత్‌లో నేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణానికి చెందిన భోగ బాలయ్య. 15 నెలలు కష్టపడి నిలువు, పేక (అడ్డం) కలుపుతూ దేశ చిత్రపటం ఆకృతి వచ్చేలా వస్త్రం రూపొందించారు.

జాతీయ భావం రేకెత్తించేలా..

ఈయన గతంలో 1,200 రంగులున్న చీరను నేశారు. ఒకే వస్త్రాన్ని 121 రంగులు, 121 డిజైన్లతో తీర్చిదిద్దారు. తన ప్రతిభకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 2021 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారంతో గౌరవించింది. స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ భావం రేకెత్తించేలా చుట్టూ రంగులు.. మధ్యలో భారతదేశ చిత్రపటం, రాట్నం చరఖా కనిపించేలా వస్త్రాన్ని రూపొందించినట్లు బాలయ్య తెలిపారు. నిలువు వంద చిటికీలు, పేక(అడ్డం) వంద చిటికీలు కలపడం వల్ల 10 వేల వర్ణాలతో వస్త్రం తయారైనట్లు చెప్పారు. ప్రభుత్వం తమ లాంటి చేనేత కళాకారులను ప్రోత్సహిస్తే చాలా ఈ వృత్తిలో రాణిస్తారని కోరారు.

కొత్తగా ఏదైనా చేయాలనే తపనతో..

మేము చేనేత మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఈ కళను మా తాతలు, తండ్రుల నుంచి నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి కొత్తకొత్త డిజైన్లు చేయాలనే ఆసక్తి ఉండేది. ఈ యాభై ఏళ్ల జీవితంలో చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర కలగాలనే ఉద్దేశంతో వారితో కొత్త కొత్త డిజైన్లతో వస్త్రాలు నేయించడం జరిగింది. కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒకే చీరలో 1600 రంగులు వినియోగించి చీర తయారు చేశాం. ప్రజలు, ప్రభుత్వం కూడా గుర్తించింది. ఒకే వస్త్రాన్ని 121 రంగులు, 121 డిజైన్లతో చీర తయారు చేశాం. ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారంతో గౌరవించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం సందర్బంగా వస్త్రం మధ్యలో భారతదేశ చిత్రపటం, చరఖా వచ్చేటట్లుగా పదివేల రంగులతో చీరను నేశాం. దీంతో చేనేత కళాకారులకు కూడా గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాం. -భోగ బాలయ్య, చేనేత కళాకారుడు

చేనేత వృత్తి మీదే..

చేనేత వృత్తి మీదే ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నాం. ఆయన చేస్తున్న పనికి మేము కూడా సాయం అందిస్తాం. వివిధ రకాల డిజైన్లు తయారు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. పదివేల రంగులతో ఒక వస్త్రంపై భారతదేశ చిత్రపటంతో పాటు చరఖాను సృష్టించి ఆయన తన దేశభక్తిని చాటుకున్నారు. చేనేత కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నాం.

-సరస్వతి, భోగ బాలయ్య సతీమణి

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.